ప్రెట్టీ ప్రీతి బాలీవుడ్ నటిగానే కాకుండా వ్యాపారస్తురాలిగా, ఇసిఎల్ ప్రాంచైంజీగా కూడా విజయవంతమైంది. హిందీ సినీ పరిశ్రమలో ముక్కుసూటిగా, మగరాయుడిలా ఉండే ప్రీతికి ఏమి దాచుకోవడం ఇష్టం ఉండదు. విషయం ఏదైనా తన ఫీలింగ్‌ను ఏ మాత్రం తడుముకోకుండా చెబుతుంది. అయితే నటిగా ప్రీతికి వచ్చిన పాపులారిటీకంటే ఇపిఎల్ తర్వాత ప్రీతి అంటే చాలామందికి క్రేజ్ ఏర్పడింది. అప్పటి నుండి అందరు ప్రీతి పై కన్నేసి ఉంచుతూ ఎప్పటికప్పుడు ఆమె వివరాలు తెలుసుకోవటంలో మునికిపోయారు. అందుకు కారణం ప్రీతి తన ప్రియుడు నేస్ వాడియాను పక్కన పెట్టి తన ఇపిఎల్ టీమ్ కెప్టెన్ యువరాజ్ సింగ్‌తో రోమాన్స్ చేస్తుండటం.
ఎంటి ప్రీతి ఇలా చేస్తున్నావు అని ఎవరైనా అడిగితే, నా జీవితం నా ఇష్టం. నాకు నచ్చిన వారితో తిరిగితే మీకెందుకు. అయితే యువీ నాకు మంచి స్నేహితుడు మాత్రమే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి నేస్ అర్థంచేసుకుంటే చాలు. వెరేవ్వరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కరాఖండిగా చెప్పింది. సరే నువ్వు ఎవరితో తిరిగితే మా కెందుకు పెళ్ళి మాటేమిటని అడిగితే, నా పెళ్ళి గురించి మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు. నాకు పిల్లలు కావల్సివచ్చినప్పుడు పెళ్ళి చేసుకుంటాను. అప్పుడు మీ అందరిని పిలిచే చేసుకుంటాను. అప్పటిదాకా పెళ్ళి ప్రస్తావన తేకుండా ఉంటే చాలని చిర్రుబుర్రులాడుతుంది. ఎంత కోపగించుకున్నా ప్రీతి మాత్రం నవ్వినా, కోపంగా ఉన్నా అందంగా ఉంటుందని అంటున్నారు ప్రీతి అభిమానులు. t>
లోడ్ అవుతోంది...